ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో తన వర్గ ప్రజలకు మాత్రమే అభివృద్ధి ఫలాలు అందాలని చంద్రబాబు అమరావతి ప్రాంతంలో తన బినామీల చేత మరియు తన పార్టీకి చెందిన నాయకుల చేత భూములను కొనిపించి తరువాత అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించడం జరిగిందని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని తాజాగా నిర్వహించిన అత్యవసర అసెంబ్లీ సమావేశాలలో బుగ్గన రాజేంద్రనాథ్ భూములు కొన్న లెక్కలతో సహా ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. అయితే ఇటువంటి తరుణంలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే వికేంద్రీకరణ జరగాలని అన్ని వర్గాల ప్రజలు సమన్యాయం పొందాలని అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి ప్రాంతాలు మరియు కులాలకు మరియు మతాలకతీతంగా ప్రజలంతా అభివృద్ధి చెందాలని మూడు రాజధానుల విషయంలో అసెంబ్లీ సమావేశాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
దీంతో విశాఖలో పరిపాలన రాజధాని అదేవిధంగా కర్నూల్ లో హైకోర్టు కల్పించే దిశగా అడుగులు వేస్తూ అమరావతిలో చట్టసభ భవనాలు ఉండేలా పరిపాలన అమరావతి లో కూడా రాజధాని ఉండేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు అదేవిధంగా కృష్ణా వాటర్‌తో సీమ కూడా అభివృద్ది అయ్యేలా చూస్తున్నారు. కోస్తాఆంధ్ర.. రాయలసీమ.. ఉత్తరాంధ్రా అందరూ అభివృద్ధితో హీరోలు అయ్యేలా సీఎం జగన్ రూపొందించారు.
దీంతో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలను ఆ విధంగా అభివృద్ధి చెందే విధంగా అడుగులు వేస్తూ వ్యవసాయపరంగా పంటలు పండే భూములను నాశనం చేయకుండా వ్యవసాయానికి అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలను చదువుకున్న వాళ్లను మరియు అదే విధంగా వ్యవసాయంపై ఆధారపడిన వారిని పైకి తీసుకువచ్చే విధంగా జగన్ నిర్ణయాలు ఉండటంతో చాలామంది జగన్ తీసుకున్న నిర్ణయాలపై సీనియర్ నేతలు దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి జగన్ అని కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద వికేంద్రీకరణ నిర్ణయంతో అంతటా అభివృద్ధి చెందాలని అడుగులు వేస్తున్న జగన్ ని దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని కామెంట్ చేస్తున్నారు.