వ్యవసాయం దండగ అంటూ రైతులపై చంద్రబాబు కాల్పులు చేపించాడని ఫైర్ అయ్యారు సీఎం జగన్. ఏలూరులోని గణపవరం లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమం లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆక్వాజోన్లో ఉన్న 10 ఎకరాలు సాగు చేస్తున్న రైతులందరికీ రూ.1.5కే సబ్సిడీపై కరెంటు అందిస్తున్నామని ప్రకటించారు.
రైతు భరోసా పథకం గత ప్రభుత్వంలో ఉందా? ఏడాదికి రూ.13500లు ఇచ్చారా? కౌలు రైతులకు ఏనాడైనా పెట్టుబడి సహాయం చేశారా? ఇలా రూ.13500 చొప్పున ఇచ్చారా? అని నిలదీశారు. మనం మేనిఫెస్టోలో చెప్పింది రూ.12500 చొప్పున నాలుగేళ్లపాటు ఇస్తామని.. చెప్పింది 4 ఏళ్లు అయితే.. 5 ఏళ్లు ఇస్తున్నామని వెల్లడించారు.
రూ.13500 చొప్పున 67500 రైతన్నలకు ఇస్తున్నామని.. దీన్ని గమనించమని కోరుతున్నానన్నారు. వైయస్సార్సున్నా వడ్డీ ద్వారా 65 లక్షలమందికిపైగా రైతులకు రూ.1282 కోట్ల రూపాయలు సున్నావడ్డీకింద ఇచ్చామని.. ఐదేళ్లలో చంద్రబాబు రూ.782 కోట్లు ఇచ్చారని విమర్శలు చేశారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ రైతుకు అండగా నిలిచాం.. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, అర్హత ఉన్న రైతుకు మేలు చేస్తున్నామన్నారు.