అక్టోబర్ 25 నాటికి వారందరికీ ఇళ్లు : సీఎం జగన్

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వైయస్సార్‌ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లే అవుట్లు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల కార్యక్రమాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… నిర్మాణ సామగ్రిని సమకూర్చడంలో క్వాలిటీ ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని… ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్‌ ఎంపిక చేసుకున్న వారికి ఇళ్లు కట్టించి… ఇచ్చే పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభం కావాలని ఆదేశాలు జారీ చేశారు.

జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కూడా ఉండాలని… 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాల కార్యక్రమం పైనా సమీక్షించిన సీఎం జగన్‌… వారికి పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే… టిడ్కో ఇళ్లపైనా సమీక్షించిన జగన్‌…. ఫేజ్‌–1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేయాలని..ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన ఎమ్ఐజీ పథకం పై సమీక్షించిన జగన్‌… రాష్ట్రంలో దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్‌ ఉందన్నారు. 150, 200, 250 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉండాలని తెలిపారు. విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధంచేసి అమలు తేదీలు ప్రకటించాలని అధికారులకు ఆదేశించారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news