కమలం వర్సెస్ కాంగ్రెస్..మధ్యలో కారుని లేపుతున్నారా?

-

తెలంగాణలో రాజకీయాలు ఊహించని రీతిలో నడుస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెండోసారి అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్…మూడోసారి కూడా అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలనే దిశగా నడుస్తున్న విషయం తెలిసిందే. మళ్ళీ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా సత్తా చాటాలని అనుకుంటుంది.

trs-congress-bjp

అయితే మునుపటిలా కాకుండా ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాలు కూడా బాగా పుంజుకున్నాయి. ఊహించని విధంగా బీజేపీ పుంజుకోగా, మొన్నటివరకు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ సడన్‌గా రేసులోకి వచ్చేసింది. ఇలా ప్రతిపక్షాలు రేసులోకి వచ్చి అధికార టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ని ఓడించి, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటిన బి‌జే‌పి, హుజూరాబాద్‌లో కూడా గెలిచి నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది.

అటు తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. పైగా కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ వీక్ అవుతూ వచ్చింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి క్లోజ్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా రేవంత్ రెడ్డి పి‌సి‌సి పగ్గాలు చేపట్టడం, టీఆర్ఎస్‌పై పోరాటం చేయడంతో కాంగ్రెస్ రేసులోకి వచ్చేసింది. బలమైన క్యాడర్ గల పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ త్వరగానే బలపడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇలా బీజేపీ, కాంగ్రెస్‌లు టీఆర్ఎస్‌కు పోటీగా తయారయ్యాయి.

ఇదే సమయంలో రెండు పార్టీలు పికప్ అవ్వడం టీఆర్ఎస్‌కే బెనిఫిట్ అయ్యేలా కనిపిస్తోంది. పైగా ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మీరు టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తున్నారని…బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలా రెండు పార్టీల ఫైట్‌తో టీఆర్ఎస్‌కు లబ్ది చేకూరేలా ఉంది. ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు ఓట్లు చీల్చుకుంటే చివరికి టీఆర్ఎస్‌కే ప్లస్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news