వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌..!

గురు శుక్ర‌వారాల్లో సీఎం జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్యంటించ‌నున్నారు. క‌డ‌ప‌, నెల్లూరు, చిత్తూరు లో వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను సీఎం ప‌రిశీలించనున్నారు. మొద‌టిరోజు జ‌గ‌న్ చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంధ‌ర్బంగా సీఎం నేరుగా బాధితుల‌తో మాట్లాడ‌నున్నారు. అంతే కాకుండా వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న అన్న‌మ‌య్య‌ప్రాజెక్టును స్వయంగా ప‌రిశీలిస్తారు. అదే విధంగా స‌హాయ‌శిభిరాల్లో ఉన్న బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తారు.

jagan
jagan

అంతే కాకుండా రాత్రి సీఎం తిరుప‌తిలోని ప‌ద్మావ‌తి అతిధిగృహంలో బ‌స చేస్తారు. ఇక రెండో రోజు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం ప‌ర్య‌టించి దెబ్బతిన్న రోడ్ల‌ను పరిశీలించి అధికారుల‌తో స‌మీక్షాస‌మావేశం నిర్వ‌హిస్తారు. ఆయా ప్రాంతాల్లో వ‌ర‌ద ప్ర‌భావం పై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎక్జిబిష‌న్ ను సీఎం ప‌రిశీలిస్తారు. అధికారుల‌తో సమావేశం ముగిసిన త‌ర‌వాత రేణిగుంట‌ నుండి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకుని అక్క‌డ నుండి తాడేప‌ల్లి చేరుకుంటారు.