ఆస్తుల వివరాలు చెప్పిన సీఎం కేసీఆర్‌..!

-

ప్రభుత్వం తీసుకోస్తున్న ధరణి పోర్టల్‌లో నాన్‌-అగ్రికల్చర్‌ ఆస్తులను నమోదు చేయడాకి తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మరియు వారి కుటుంబ ఆస్తి వివ‌రాలను సీఎం స్వయంగా అధికారులకు తెలియజేశారు..ఎర్ర‌వ‌ల్లిలోని త‌న నివాస గృహానికి వ‌చ్చిన‌ గ్రామ కార్య‌ద‌ర్శి, సిబ్బందికి సాధార‌ణ పౌరుడి మాదిరిగానే త‌న కుటుంబం ఆస్తుల వివ‌రాల‌ను తెలియ‌జేశారు కేసీఆర్‌..సీఎం నివాస గృహాల వివ‌రాల‌ను తెలంగాణ వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల న‌మోదు యాప్‌లో గ్రామ కార్య‌ద‌ర్శి న‌మోదు చేశారు.
ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఆస్తుల న‌మోదు అనేది దేశంలోనే మొట్ట‌మొద‌టి అతి పెద్ద ప్ర‌య‌త్న‌ం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని, ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ స్థిరాస్తుల న‌మోదు ప్ర‌క్రియ చ‌రిత్ర‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామీణ‌, పట్టణ ప్రాంత ప్ర‌జ‌లు త‌మ స్థిరాస్తుల వివ‌రాల‌ను తప్పని సరిగా ఆన్‌లైన్‌లో న‌మోదు చేసుకోవాల‌ని కోరారు. ఆస్తుల‌పై ప్ర‌జ‌ల‌కు హ‌క్కు, భ‌ద్ర‌త క‌ల్పించేందుకే వివ‌రాలను న‌మోదు చేస్తున్న‌ట్లు సీఎం తెలిపారు..సాగు భూముల త‌ర‌హాలోనే వ్య‌వ‌సాయేత‌ర భూముల‌కు ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాలు ఇస్తామ‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news