హత్రాస్ ఘటన : రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు.. పోలీసులపై చర్యలు తప్పవు.!

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో ఓ దళిత యువతిపై కొంతమంది కామాంధులు దాడి చేసి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఘటన నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం పై ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల కేంద్రప్రభుత్వం అత్యాచార ఘటనలపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి అంటూ హెచ్చరించింది.

మహిళలపై లైంగిక వేధింపుల కేసులో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ అన్ని రాష్ట్రాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా అత్యాచార కేసులు 60 రోజుల్లో విచారణ పూర్తి చేసి కోర్టుకు పూర్తి వివరాలను అందించాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ పోలీసులను హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. అయితే రోజురోజుకు దేశంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలు నిర్మూలించేందుకు కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news