గల్లీ చిన్నది పాట మనసుపెట్టి వింటే దళితుల సమస్యలకు పరిష్కారం : సీఎం కేసీఆర్

-

ప్రగతి భవన్ లో సమావేశమైన అఖిలపక్ష బేటీ ఇంకా కొనసాగుతోంది. ఈ భేటీలో దళితుల సమస్యల పై వాటి పరిష్కారాల పై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. అయితే ఈ అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగింది….మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలని సీఎం కెసిఆర్ పేర్కొన్నారు. గోరేటి వెంకన్న పాడిన గల్లీ చిన్నది.. పాట ను మనసు పెట్టీ వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని వెల్లడించారు సీఎం కెసిఆర్. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడి విడి గా గుర్తించి పరిష్కారాలు వెతకాలని…దళితుల సామాజిక ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సమాధానాలు సాధించాలన్నారు.

దళితుల అభ్యున్నతికి సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరి నేరుగా ఆర్ధిక సాయం అందే విధంగా…అత్యంత పారదర్శకంగా, మధ్య దళారీలు లేని విధానం కోసం సూచనలు సలహాలు ఇవ్వాలని అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులను కోరారు సిఎం కెసిఆర్. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలని…అట్టడుగున వున్న వారినుంచి సహాయం ప్రారంభించి, వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. ఈ బడ్జెట్ లో సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకానికి 1000 కోట్లు కేటాయించాలనుకున్నామని.. మరో 500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా అని తెలిపారు.

రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తుందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్, ఎస్సీ సబ్ ప్లాన్ కు అదనమని.. దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్ లో పనిచేయడానికి నిశ్చయించుకున్నది… మీరందరూ కలిసిరావాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news