మహాత్మా గాంధీని కించ పరుస్తున్నారు..బీజేపీపై కేసీఆర్ ఫైర్

-

బీజేపీ పార్టీపై మరోసారి సీఎం కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీని కించ పరుస్తున్నారని మండిపడ్డారు. ఇది వాంఛనీయం కాదు… ఏ జాతి కూడా తన చరిత్ర ను తానే మలినం చేసుకోదని… ఆ శక్తుల ప్రయత్నాలు ఎప్పుడు నెరవేరదని వెల్లడించారు. హెచ్‌ఐసీసీలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్, జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్రోద్యమ చరిత్ర కొత్త తరానికి తెలియదు… తెలియ చేయాలని.. విశ్వమానవుడు అయిన గాంధీ జి వారసులము మనమన్నారు. ఆయన ప్రపంచం లో ఎంతో మందికి స్ఫూర్తి అని.. సంస్థానాలు విలీనం కోసం ప్రస్తుత దేశ నిర్మాణానికి ఎంతో మంది కష్ట పడ్డారని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 1948 సెప్టెంబర్ 17 న భారత దేశం లో విలీనం అయింది..మనం పవిత్ర కర్తవ్యం తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పేదరికం ఎంత వరకు దేశం లో ఉంటుందో అలజడి లు కొనసాగుతూనే ఉంటాయని.. దళిత సమాజం తనకు జరగాల్సింది జరగలేదని అక్రోషిస్తుందని పేర్కొన్నారు. అశాంతి నీ అధిగమించాలి అంటే స్వార్థాన్ని పక్కన పెట్టు కొని కంకణ దారులం కావాలని.. ప్రతి వ్యక్తి నేను ఈ దేశం లో బాగస్వామి నీ అనే ఫీలింగ్ రావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news