BREAKING : విద్యుత్ చట్టసవరణ బిల్లు-2022ను లోక్ సభలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రవేశపెట్టారు. కాసేపటి క్రితమే..ఈ బిల్లును లోక్ సభలో ఆమోదానికి పెట్టారు కేంద్ర మంత్రి. అయితే.. ఈ విద్యుత్ చట్టసవరణ బిల్లు-2022ను తీవ్రంగా వ్యతిరేకించాయి విపక్ష పార్టీలు. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను కేంద్రం చేతిలోకి తీసుకుంటున్నారని ఆందోళన చేస్తున్నాయి విపక్షాలు. విపక్షాల ఆందోళనతో బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు సిఫారసు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ ఆర్ఎస్పీ ఎన్ కే ప్రేమ్ చంద్రన్ మాట్లాడుతూ.. చట్ట సవరణ ముందు రాష్ట్రాలతో లోతుగా అభిప్రాయాలు తీసుకోలేదని.. రైతంగానికి వ్యతిరేకంగా బిల్లు ఉందని నిప్పులు చెరిగారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటోందని మండిపడ్డారు. విపక్షాల అభిప్రాయాలు తెలుసుకోకుండా బిల్లును స్టాండింగ్ కమిటీకి ఎందుకు సిఫారసు చేశారని.. అలాంటప్పుడు బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. ఇవాళ పేద రైతులకు అన్యాయం జరుగుతుందని.. తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, పంజాబ్, చత్తీస్ ఘడ్ , పుదుచ్చేరి, సంయుక్త కిసాన్ మోర్చ అందరూ ఈ బిల్లును వ్యతరేకిస్తున్నారన్నారు అధీర్ రంజన్ చౌదరీ.