పోలీసులకు కేసీఆర్ సంచలన ఆదేశాలు..

-

హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని కేసీఆర్  అన్నారు. నిరాశ, నిస్పృహల్లో కొన్ని అరాచక శక్తులు ఈ పనిలో ఉన్నాయని అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అరాచక శక్తుల కుట్రపై ప్రభుత్వం దగ్గర కచ్చితమైన సమాచారం ఉందని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానం అని అన్నారు. సంఘ విద్రోహ శక్తులను అణిచేందుకు పోలీసులకు పూర్తి స్వేఛ్చనిస్తున్నామని అన్నారు. 

సామరస్యాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని ఈ సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తున్నారని మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేశారు, మార్ఫింగ్ ఫొటోలతో ప్రజల్ని ఏమార్చాలని చూశారు అని అన్నారు. మాటలతో కవ్వింపు చర్యలకు పూనుకున్నారన్న ఆయన శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదని అన్నారు. జిల్లాల్లో గొడవులు రాజేసి హైదరాబాద్‌కు విస్తరించాలని చూస్తున్నారని అన్నారు. ప్రార్థనా మందినాల వద్ద వికృత చేష్టలు చేయాలని చూస్తున్నారని ఈ ఎన్నికలు వాయిదా వేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news