భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు బీఆర్‌ఎస్‌ ప్రణాళిక సిద్ధం

-

తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో అధికార పార్టీ భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల శంఖారావం పూరించేందుకు గులాబీ బాస్ సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో అక్టోబ‌ర్ 15వ తేదీ నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. 15న హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ పాల్గొన‌నున్నారు. 16వ తేదీన జ‌న‌గామ‌, భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో, 17న సిద్దిపేట‌, సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో, 18న జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో 2 గంట‌ల‌కు, సాయంత్రం 4 గంట‌ల‌కు మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

Sri K. Chandrashekar Rao

16న జనగామ, భువనగిరిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. 17న సిద్ధిపేట, సిరిసిల్ల, 18న, మేడ్చల్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించి అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. అదే సమావేశంలో అభ్యర్థులందరికీ బీఫారంలు అందచేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని పార్టీ కార్యాలయం నుంచి సంబంధిత అభ్యర్థులకు సమాచారం అందింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news