బ్రేకింగ్: కేసీఆర్ అత్యవసర సమావేశం, ఎందుకంటే…!

-

తెలంగాణా సిఎం కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వాహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు గానూ సిఎం కేసీఆర్… బుధవారం ఉదయం 11:30గంటలకు ప్రగతిభవన్ లో పోలీసు ఉన్నతాధికారుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి తదితర మాదక దృవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా ఆయన అధికారులతో చర్చిస్తారు.

CM-KCR
CM-KCR

ఈ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో మావోయిస్ట్ ల కదలికలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి హోం, అటవీ శాఖ మంత్రులు, కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డి.జి.పి, అడిషనల్ డి.జి.పిలు, ఐ.జీలు, డి.ఐ.జీలు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news