టీఆర్‌ఎస్‌ కు షాక్‌..జగిత్యాలలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీ దహనం !

-

ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు.

అయితే, జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని అంగడి బజార్ లో గల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎదుట టిఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే కొండా లక్ష్మణ్ అభిమాని మంగళవారం రాత్రి ఫ్లెక్సీ పై పెట్రోల్ చల్లి దహనం చేశాడు. ఆ భారీ ఫ్లేక్సీ సీఎం కేసీఆర్‌ దేనని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news