భారీ కాన్వాయ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని సోలాపూర్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయన రెండు రోజులు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. బస్సులో భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గంలో ప్రగతి భవనం నుంచి పయనమయ్యారు. దాదాపు 600 వాహనాలు ఆయనతో కదిలారు. కేసీఆర్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు వెళ్లారు.
పండరీపూర్‌లోని విఠోభారుక్మిణి మందిర్‌లో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత సోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ధారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు రోడ్డుమార్గాన బయల్దేరనున్నారు. సీఎం బస్సులో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర నేతలు ఉన్నారు.