“తెలంగాణ దళిత బంధు”పేరుతో కొత్త పథకం : కేసీఆర్‌ సంచలన నిర్ణయం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. “తెలంగాణ దళిత బంధు” అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజక వర్గాన్ని ఎంపిక చేసి, ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని అమలును ప్రారంభించాలని సమావేశం నిర్ణయించింది.

cm-kcr
cm-kcr

అందులో భాగంగా పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజవర్గాన్ని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సిఎం ప్రారంభించారు. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు.అదే ఆనవాయితీని సిఎం సెంటిమెంటును కొనసాగిస్తూ…‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రారంభోత్సవ తేదీని త్వరలో సిఎం కేసీఆర్ ప్రకటిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news