నూతన సచివాలయం పనులు పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. కొత్త సెక్రటేరియట్ పనులు ఎక్కడి వరకు వచ్చాయోనని అధికారులను ఆరా తీస్తున్నారు. కేసీఆర్ వెంట సీఎస్ శాంతి కుమారి, మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.

సచివాలం ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి క్యాబిన్ ఉxడనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గదికి సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో తుది మెరుగులు దిద్దతున్నారు. ఇప్పటికే వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నూతన సచివాలయానికి చేరుకున్నారు. మెుత్తం భవనం పనులు ఎంత వరకు పూర్తయ్యాయి, ఇంకా ఎంత మేరకు పూర్తికావాల్సి ఉందని అనే అంశాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. జూన్‌ 2 లోపు నెల రోజుల వ్యవధిలో తెలంగాణ సచివాలయం, అమరవీరుల స్మృతి చిహ్నాలకు ప్రారంభోత్సవం చేస్తామన్నారు.

మరోవైపు హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరాన నిర్మిస్తున్న దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నిర్మాణం పూర్తయినందున ఆయన జయంతి రోజైన ఏప్రిల్‌ 14న దాన్ని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news