తెలంగాణా సిఎం కేసీఆర్ కరోనా కట్టడి మీద దృష్టి సారించారు. తెలంగాణాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ చర్యలు చేపడుతున్నారు. ఇక తాజాగా ప్రగతి భవన్ లో కోవిడ్ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ , హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు , హెల్త్ సెక్రటరీ ,ఇతర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.
హై కోర్ట్ విచారణ నేపథ్యంలో కరోనపై పూర్తి స్థాయిలో పరిస్థితులపై అధికారుల నుండి సిఎం కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఆక్సిజన్ , రేమిడిసివిర్ , వ్యాక్సిన్ సరఫరా చేస్తామని ప్రకటించింది అని తెలిపారు. దీనిపై కేంద్రానికి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. ఇక లాక్ డౌన్ పై కూడా సిఎం కేసీఆర్ అధికారుల ను అడిగి ఆయన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.