BREAKING : యాసంగిలో వ‌రి కొనేది లేదు : సీఎం కేసీఆర్‌

-

యాసంగి కాలంలో వ‌రి ధాన్యాన్ని ప్ర‌భుత్వం కొనేదే లేద‌ని సీఎం కేసీఆర్ మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టి చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జిల్లా కలెక్టర్ల సమావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది యాసంగిలో వరి కొనుగోలు చేసేది లేదని.. సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొనుగోళ్లపై కేంద్రం తీరును రైతులకు వివరించాలని కలెక్టర్లకు సూచనలు చేశారు. తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశంలోనే ఎక్కడా లేవని… రాబోయే వానాకాలం పంట పై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వాన కాలంలో పత్తి, వరి మరియు కొన్నిసార్లు పై దృష్టి సారించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. కానీ యాసంగి లో మాత్రం వ‌రి మాత్రం వేయ‌ద్ద‌ని రైతుల‌ను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news