బండి సంజయ్ నాకెప్పుడు మందు కలిపినవ్.. నా ఫామ్ హౌస్ కి రా : కేసీఆర్

-

బండి సంజయ్ నువ్వెప్పుడు నాకు మందు కలిపావు… నా ఫామ్ హౌస్ కు రా ఆరు ముక్కలు అవుతావు అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. అది ఫార్మర్ హౌస్ అని ఫార్మ్ హౌస్ కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నేను బాజాప్తా వ్యవసాయ క్షేత్రం లో ఉంటున్నా తప్పేంటి అంటూ ప్రశ్నించారు. జ్యోతిరాదిత్య సింధియా కు కేంద్ర మంత్రి పదవి ఎలా ఇచ్చారు అని కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో మంత్రి పదవుల్లో ఉద్యమకారులకే ఎందుకు ఉంటాయని కేసీఆర్ ప్రశ్నించారు. సమయం సందర్భం బట్టి పదవులు వస్తాయని అన్నారు.

దిక్కు మాలిన మాటలు బిజెపి నాయకులు ఆపాలని వ్యాఖ్యానించారు. దేశంలో అతి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ ఏది అని పిచ్చోడిని అడిగినా కూడా బిజెపి అని చెబుతాడు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాలని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కేసీఆర్ బండి సంజయ్ కి వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news