ఫామ్ హౌజ్ దున్నడానికి బండి సంజయ్ ఏమైనా ట్రాక్టర్ డ్రైవరా.?- సీఎం కేసీఆర్

-

బండి సంజయ్ కేసీఆర్ ఫామ్ హౌజ్ ను దున్నుతాం అని బండి సంజయ్ కామెంట్లకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌజ్ దున్నడానికి బండి సంజయ్ ఏమైనా ట్రాక్టర్ డ్రైవరా.. అని ఎద్దేవా చేశారు. చట్టానికి, భూసంస్కరణలకు అనుగుణంగా బాజాప్తా భూమిని కొనుగోలు చేశామన్నారు. ఫామ్ హౌజ్ దున్నడానికి రా.. ఆరు ముక్కలు అవుతావ్ అని తీవ్ర స్వరంతో బండి సంజయ్ ని హెచ్చిరించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం మా కుటుంబం అనేక త్యాగాలు చేసిందన్నారు. మిడ్ మానేరు డ్యాం కోసం మా కుటుంబానివి, మా అత్తగారి కుటుంబానివి భూములను కోల్పోయాం. తర్వాత మాకు అనుకూలంగా ఉన్న చోట భూములను కొనుకున్నాం అని కేసీఆర్ అన్నారు. నేను వ్యవసాయదారు కుటుంబంలో పుట్టా.. రైతుగా ఉన్నానంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. నా వ్యవసాయ క్షేత్రానికి మిమ్మల్ని కూడా ఆహ్వానించి భోజనం పెట్టా అని విలేకరులను గురించి కేసీఆర్ అన్నారు. నా నియోజకవర్గంలోనే ఫామ్ హౌజ్ ఉంది.. బాజాప్తా నా ఫామ్ హౌజ్ కు వెళ్తా అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news