తెలంగాణ సర్కార్ చేపట్టిన దళిత బంధు పథకం అమలును మరింత వేగవంతం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎంపికైన లబ్ది దారులకు త్వరగా ఫలితం అందేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రోజుకు 400 మంది చొప్పున ఇప్పటి వరకు 25 వేల మంది అర్హులైన లబ్ది దారులకు దళిత బంధును అందించామని సీఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా నివేదిక అందజేశారు.
ఈ సందర్భంగాసీఎం కేసీఆర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే.. దళిత బంధు కోసం అవసరమైన నిధులను విడుదల చేసింది. గుర్తించిన అర్హులకు నిధులను అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ… ఆలస్యం జరగొద్దన్నారు సీఎం కేసీఆర్. దళిత బంధును మరింత ప్రభావవంతంగా.. వేగ వంతంగా అమలు చేసేందుకు త్వరలోనే జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ వివరించారు. దళిత బంధు పథకం అమలవుతున్న విధానం పట్ల దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుకుంటున్నామని చెప్పారు.