ఎన్నో అంచనాలను పోగేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న ఆచార్య సినిమా విడుదలకు సంబంధించి అన్ని పనులూ శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగిల్ లైనర్ డైలాగ్స్ తో మంచి రైటర్ అనిపించుకున్న కొరటాల శివ ఈ సినిమాతో కూడా ఎంతో బాధ్యతగా ఓ కథను వినిపించనున్నారు.
సామాజిక దృక్పథం మరియు మంచి నేపథ్యం ఉన్న కథలకు ఆయన కేరాఫ్.. ఊరి నుంచి చాలా తీసుకున్నారు ఇచ్చేయండి లేకపోతే లావయిపోతారు అని శ్రీమంతుడితో చెప్పించిన కొరటాల శివ.. అదే వేగంతో భరత్ అను నేను సినిమా తీసి మంచి పేరు తెచ్చుకున్నారు. అటుపై కూడా ఆయన మంచి కథకుడిగా కొనసాగాలన్న తలంపుతోనే ఈ సారి ఇదిగో చిరుతో మరో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ను కలుపుకుని సినిమా రూపుదిద్దించారు. ఇక విడుదలకు ముందు ఆనవాయితీగా జరిపే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
ముందుగా ఈ సినిమా ఫంక్షన్ కు సంబంధించి వెన్యూ మారింది. తొలుత నిర్ణయించిన విధంగా విజయవాడ సిద్ధార్థ్ కళాశాల ప్రాంగణంలో చేయాలనుకున్నా కొన్ని కారణాల రీత్యా వేదిక హైద్రాబాద్ కు షిఫ్ట్ అయింది. అదేవిధంగా వేడుకలకు ఏపీ సీఎం జగన్ వస్తారని భావించినా అది కూడా లేదని తేలిపోయింది. దీంతో రాజకీయంగానూ సినిమా పరంగానూ ఎంతో ఆసక్తి రేపిన ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాస్త చిరుకు నిరాశే!ఈ నేపథ్యంలో జగన్ ఎందుకు రావడం లేదు ఎందుకు వెన్యూ మారింది అన్నవి ఆరా తీస్తే.. ఇప్పటికే జనసేన వెర్సస్ జగన్ అన్న విధంగా పరిణామాలు ఉన్నాయి.
రాజకీయంగా పవన్ ను ఢీకొనే వారిలో జగన్ ఒకరు.. కనుక ఎందుకు వచ్చిన గొడవ అని ముందే తన నిర్ణయం నుంచి తప్పుకున్నారు. దీంతో ఎప్పటిలానే హైద్రాబాద్ నగర లోగిళ్లలో జగన్ లేకుండానే వేడకలు అయితే జరగనున్నాయి. ఏప్రిల్ 23న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయనున్నారు.