కేసీఆర్ ఆ పని చేయగలిగితే చాలా గ్రేట్..!

-

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై పీట ముడి బిగుసుకుపోతోంది. కార్మికులు వెనక్కితగ్గేది లేదంటున్నారు. ఇటు కేసీఆర్ కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఓ సంచలన ప్రకటన చేశారు. మూడంటే మూడు రోజుల్లో వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలంటున్నారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సిఎం స్పష్టం చేశారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సిఎం ప్రకటించారు.

50 శాతం ఆర్టీసీ బస్సులు నడపడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని, 30 శాతం బస్సులను అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీలో వందకు వందశాతం బస్సులను పునరుద్ధరించాలి. దీనికోసం అసవరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలంటున్నారు కేసీఆర్.

రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలి. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలి. అధికారులు రేయింబవళ్లు పనిచేసి, మూడు రోజుల్లో వందకు వంద శాతం బస్సులు నడిచేలా చూడాలంటున్నారు సిఎం కేసీఆర్. అయితే మూడు రోజుల్లో నూటికి నూరు శాతం బస్సులు తిప్పడం అంత సులభమైన వ్యవహారం కాదు. నిజంగా ఈ పని కేసీఆర్ చేయించగలిగితే ఆయన గ్రేట్ అని ఒప్పుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news