సీఎం కేసీఆర్ వరాల జల్లు… జిల్లాకు కోటి రూపాయలు మంజూరు

-

తెలంగాణ రాష్ట్ర స్థాయి అధికారులు.. మంత్రుల పర్యటనల సందర్భంగా వారి సౌకర్యార్థం ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయంలో “రాష్ట్ర చాంబర్” ను ఏర్పాటు చేయాలని..ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలో ” జంట హెలిపాడ్ ” లను ఏర్పాటు చేయాలని సీఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని ప్రభుత్వ శాఖల కు సంబంధించిన భూములు స్థలాలు ఇతర ఆస్తుల వివరాలను.. (“ఇన్వెంటరీ ” లను) జూలై నెలా ఖరు కల్లా సిద్దం చేయాలని.. ప్రభుత్వ శాఖల, భూములు ఆస్తుల వివరాలను రికార్డు చేయడానికి, సంరక్షణ, పర్యవేక్షణ కోసం జిల్లాకో ఎస్టేట్ ఆఫీసర్ ను నియమించాలన్నారు.

వీరు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పని చేయాలని…రాష్ట్ర స్థాయి ఎస్టేట్ ఆఫీసర్ ను నియమించి సిఎస్ పర్యవేక్షణ లో విధులు నిర్వహించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం కెసిఆర్. పల్లెలు పట్టణాల అభివృద్ది కోసం ఖర్చు చేసేందుకు…మంత్రుల వద్ద 2 కోట్లు, ప్రతి జిల్లా కలెక్టరు కు ఒక కోటి రూపాయల ఫండ్ ను కేటాయిస్తున్నామన్నారు సీఎం కెసిఆర్. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు ఒక కోటి రూపాయల చొప్పున 32 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు.. నియోజకవర్గ అభివృద్ది నిధులను ( cdf) స్థానిక జిల్లా మంత్రి నుంచి అప్రూవల్ తీసుకొని ఖర్చు చేయాలన్నారు సిఎం కెసిఆర్.

Read more RELATED
Recommended to you

Latest news