ఏపీ రైతుకు కేసీఆర్ ఫోన్..తెలంగాణకు రావాలని ఆహ్వానం

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యవసాయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందన్న సంగతి తెలిసిందే. స్వయంగా ఆయన కూడా తన ఫాంహౌస్లో రకరకాల పంటలు పండిస్తూ వ్యవసాయం మీద తనకున్న మక్కువను తీర్చుకుంటుంటారు ఆయన. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక రైతు ఫోన్ చేసి తెలంగాణకు నమ్మని ఆహ్వానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావుకు నిన్న ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు.

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం ఘంటసాల పాలానికి చెందిన ప్రసాదరావుకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. సీడ్రిల్ ఆధునిక వ్యవసాయ యంత్రాలు వాటితో వెద పద్ధతిలో సాగు అంశాలపై ప్రసాదరావుని కెసిఆర్ కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాను 35 ఎకరాల్లో సీడ్రిల్‌ను ఉపయోగించి వెద పద్ధతిలో సన్నాల రకం వరి సాగు చేశానని దానికి 40-45 బస్తాలు దిగుబడి వచ్చిందని ప్రసాద రావు తెలిపారు. అయితే తాను త్వరలో కారు పంపిస్తానని, తెలంగాణలో వ్యవసాయ పద్ధతులు పరిశీలించాలని, ఒక పూట తన ఆతిద్యం స్వీకరించి భోజనం చేసి వెళ్లాలని ప్రసాదరావుని కేసీఆర్‌ ఆహ్వానించారు. కేసీఆర్‌ నుంచి ఫోన్‌ రావడంతో ప్రసాదరావు ఆనందానికి ఆవదులు లేవు అంటే నమ్మండి. 

Read more RELATED
Recommended to you

Latest news