తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. పాఠశాలలో బాగు కోసం మరో పథకాన్ని తీసుకు వచ్చేందుకు… సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఇతర విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బడుల రూపురేఖలు మార్చేందుకు ఏడాదికి రెండు వేల కోట్ల చొప్పున… వరుసగా రెండేళ్లపాటు నాలుగు వేల కోట్ల నిధులను కేటాయిస్తామని… అందుకు ప్రత్యేక పథకాన్ని తెస్తామని గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీనిని వీలైనంత త్వరగా ప్రారంభించాలని.. అలాగే ఈ పథకానికి ” బడుగుల బాగు” అనే పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఈ పథకం అమలుపై… మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. ఇక అటు యూనివర్సిటీల్లో ఆచార్యులకు ఖాళీల భర్తీ ని వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది.