గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట వినేందుకు ఏ ఆఫీసర్ లేరంటూ… ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా నాళాలు కబ్జా ఉంటే వెంటనే తొలగించాలని మరోసారి మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారని.. వివిధ కార్యక్రమాల సందర్భంగా ఎన్నోసార్లు మాటలు చెప్పినా అమలు కావడం లేదని చురకలంటించారు.
నాల ఆక్రమణపై మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాల నేపథ్యంలో గురువారం రాజా సింగ్ స్పందించారు. పాతబస్తీలో, హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాల్లో అలాగే గోషామహల్ నియోజకవర్గంలో నిజాం కాలం నాటి నాళాలు అదే సైజుతో ఉన్నాయని వాటిని పూర్తిగా ఆక్రమించాలని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. దీనిపై మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజా సింగ్. టిఆర్ఎస్ ప్రభుత్వం.. మజ్లీస్ నేతలకు కొమ్ము కాస్తోందనీ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ.. త్వరలోనే అధికారంలోకి రాబోయేది ఉందంటూ కూడా తెలిపారు రాజా సింగ్