ముఖ్యమంత్రి కేసీఆర్ అడవుల జిల్లాలోని ఓ పల్లెను తెగ పొగిడారు. ఆ పల్లెను రాష్ట్రంలోని గ్రామాలన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంతకీ ఆ పల్లె పేరేంటి..? కేసీఆర్ ఎందుకు ఆ గ్రామాన్ని ప్రశంసలతో ముంచెత్తారు..? ఆ పల్లె స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా..?
రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఆదిలాబాద్ జిల్లా ముఖరా-Kను ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఊరిలో సేకరించిన చెత్తను వర్మికంపోస్టు ఎరువుగా మార్చుతున్నారు. అలా ఆదాయం నుంచి లక్ష రుపాయలను ముఖ్యమంత్రి సహాయనిధి ముఖరా-K గ్రామస్థులు విరాళంగా ఇచ్చారు. రాష్ట్రంలో పల్లెలు ప్రగతిపథంలో సాగుతున్నాయని తెలిపేందుకు ముఖరా-K గ్రామమే నిదర్శమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఆ గ్రామంలో సేకరించిన తడిచెత్త ద్వారా వర్మికంపొస్ట్ తయారు చేసి 7లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించడం అద్బుతమని కేసీఆర్ అభినందించారు. తమకు ఆదాయం వచ్చిన 7 లక్షల రూపాయల్లో 4 లక్షల రూపాయలు సొలార్ గ్రిడ్, 2 లక్షలతో డిజిటల్ లైబ్రరి ఏర్పాటు చేసినట్లు ముఖరా సర్పంచ్ మీనాక్షి తెలిపారు. మిగతా లక్ష రూపాయలు సీఎం సహాయనిధికి ఇచ్చినట్లు చెప్పారు.