దళితులకు కేసీఆర్ మరో శుభవార్త ; వ్యాపారాల్లోనూ రిజర్వేషన్లు

దళితులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు మరో తీపి కబురు చెప్పారు. ఇక ముందు వ్యాపారాల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్‌. కాంట్రాక్టు లు, మెడికల్, ఫర్టిలైజర్ దుకాణాలు, వైన్, బార్ షాపు ల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామని పంద్రాగస్టు వేడుకల సందర్భంగా పేర్కొన్నారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

దళిత బంధు లబ్ది దారులకు ఇతర పథకాలు ఎప్పటి లాగానే అమలు అవుతాయని.. రేషన్, పింఛన్లు యధాతధంగా అమలు చేస్తామన్నారు. హుజూరా బాద్ లో సంపూర్ణంగా.. మిగతా నియోజక వర్గాల్లో పాక్షికంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కులం పేరిట నిర్మించిన ఇనుప గోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలన్నారు. దళిత జాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అని పేర్కొన్న సీఎం కేసీఆర్‌… ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అని స్పష్పం చేశారు. దళితుల కోసం ఇంకా ఎన్నో పథకాలు తీసుకు వస్తామని పేర్కొన్నారు.