తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపద్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలకు కరోనా పరీక్షలు ఉచితంగా చేయించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈక్రమంలో హైదరబాద్ లో 11 కరోనా పరీక్షా కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాలకు ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకోవచ్చు. ఎవ్వరికీ ఎప్పుడు ఎటువంటి అస్వస్థ గురైనా కరోనా లక్షణాలు కనిపించినా వారు ఆ కేంద్రాలకు వెళ్ళి ఉచితంగా టెస్ట్ చేయించుకునేందుకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.
ఉచిత కరోనా పరీక్ష కేంద్రాలివే:
- కోఠిలోని కింగ్ కోఠి హాస్పిటల్
2.నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి
3.ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్
4.అమీర్ పేటలోని నేచుర్ క్యూర్ ఆసుపత్రి
5.మెహదీపట్నంలోని సరోజిని దేవి ఐ హాస్పిటల్
6.ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్ హాస్పిటల్
7.రామంతపూర్‌లోని హోమియోపతి హాస్పిటల్
8.చార్మినార్‌లోని నిజామియా టిబ్బి హాస్పిటల్
9.కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రి
10.వనస్థలి పురంలోని ఏరియా ఆసుపత్రి
11.నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్