సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం దళిత బంధు. ఈ పథకాన్ని కెసిఆర్ హుజురాబాద్ నుండి పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు ప్రారంభించనున్నారు. అయితే ముందుగా ఈ పథకంలో 15 కుటుంబాలకు 10 లక్షల చొప్పున కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఇప్పటికే హుజరాబాద్ లో దళిత బంధు కోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇక కేసీఆర్ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు మరియు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. 100 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పుతో సభ వేదికను ఏర్పాటు చేశారు. ఇక మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ సభ జరగనుంది. హుజురాబాద్ లో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి. రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగా ఒక మండలం నుండి ఈ పథకం కోసం ఇద్దరిని ఎంపిక చేశారు. అంతేకాకుండా ఒక మున్సిపాలిటీ నుండి ముగ్గురు లబ్ధిదారులను ఎంపిక చేశారు.