హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్టు.. ఇంటినే ల్యాబ్ గా మార్చి డ్రగ్స్ తయారీ.

హైదరాబాద్ లో మరో మారు మాదక ద్రవ్యాల వ్యాపారం వెలుగులోకి వచ్చింది. మాదక ద్రవ్యాలు అమ్మకం జరుపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసారు. హైదరాబాద్ లోని బాలానగర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న ఐదుగురు యువకులు, దాన్ని ల్యాబ్ గా మార్చేసి డ్రగ్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. ఎన్నోరోజులుగా సాగుతున్న ఈ వ్యవహారం తాజాగా బయటకి వచ్చింది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసారు.

మొత్తం ఐదుగురిని అరెస్టు చేసి, వారి నుండి 3.25కిలోల మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 12లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. యువతను మత్తిలో ముంచేస్తున్న మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని అటు ప్రభుత్వాలు, ఇటు సమాజం ఎంత గగ్గోలు పెడుతున్న చీకటి ముసుగులో మాదక ద్రవ్యాల రవాణా కొనసాగుతూనే ఉంది. మాదక ద్రవ్యాల అమ్మకం, వాడకంపై కఠిన శిక్షలు కూడా ఉన్నాయి.