మాసిపూసి మారేడు కాయ చేయడంలో కేసీఆర్ ని మించిన వారు లేరనే చెప్పాలి…మాటల గారడీ చేయడంలో ఆయన స్థాయే వేరు…చేసేది తక్కువ ఉన్న చెప్పేది మాత్రం ఎక్కువే. పైగా జనాలని ఆకర్షిస్తూ మాట్లాడటంలో కేసీఆర్ ధిట్ట. అలాగే మాటలని ఇట్లే మార్చి జనాలని ఏ మార్చడంలో కేసీఆర్ తోపు. అసలు ఆయన చెప్పేవే కరెక్ట్ అన్నట్లు…ఇంకా వేరే వాళ్ళు చెప్పేవన్నీ తప్పు అన్నట్లు మాటలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ని మాటల మాంత్రికుడు అని చెప్పొచ్చు.
ఇక తాజాగా కూడా గంటల పాటు మీడియా సమావేశం పెట్టి..మరోసారి తన మాటల గారడీ ఏంటో కేసీఆర్ చూపించారు. ఆయన అన్నీ గంటల పాటు మీడియా సమావేశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే…దేశంలో తాను పనిచేస్తున్నట్లు ఎవరూ చేయట్లేదన్నట్లు..అలాగే తనలో పదవ వంతు కూడా కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేయట్లేదనేది కేసీఆర్ మాటల్లో అర్ధం. అందుకే కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేస్తానని కేసీఆర్ సవాళ్ళు విసురుతున్నారు.
అయితే కేసీఆర్ మాటలు ఎప్పుడు ఒక ట్రాప్ లాంటివే..వాటిల్లో పడితే బయటపడటం కష్టం. ఆ మాటల చుట్టూనే రాజకీయం జరిగితే..కేసీఆరే హైలైట్ అవుతారు. కాబట్టి ఆయన మాటల గారడీలో బీజేపీ నేతలు పడకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు. ఆయన మాటలు వదిలేసి…తెలంగాణ బీజేపీ నేతలు కేవలం..రాష్ట్రంలోని కేసీఆర్ పాలనల ఉన్న లోపాలని, ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపైనే కమలనాథులు ఫోకస్ పెట్టి పనిచేసుకుంటూ వెళ్ళాలి.
అలాగే క్షేత్ర స్థాయిలో బీజేపీని ఇంకా బలోపేతం చేస్తూ…టీఆర్ఎస్ బలాన్ని తగ్గిస్తూ ముందుకెళ్లాలి…నియోజకవర్గ స్థాయిలో బలపడితే…అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేరు..ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన బలాన్ని సంపాదించేవరకు బీజేపీ నేతలు విశ్రమించకూడదు..మధ్యలో ఇలా కేసీఆర్ మాటల గారడీ ట్రాప్ లో పడకూడదు. ఆయనకు మాటలతో కంటే చేతలతోనే చెక్ పెట్టాల్సిన అవసరముంది..ఆ దిశగానే బీజేపీ నేతలు కూడా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికైతే కేసీఆర్ ట్రాప్ లో కమలనాథులు పడటం కష్టమే.