తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టింది. ఇక ఇప్పుడు ప్రసిద్ధి దేవాలయాలైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు అంజన్న కోవెల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా తానే కొండగట్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే, ఈ నెల 14న అంటే ఎల్లుండి కొండగట్టుకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్… ఆలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించనున్నారు.