సీఎం కేసీఆర్ పై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు..

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ చంద్రశేఖర రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి.విద్యార్థుల భవిష్యత్తును తెలంగాణ సర్కారు ఆనారోగ్యం పాలు చేస్తోంది. బాసర ట్రీపుల్ ఐటీ విద్యార్థుల అగచాట్లు, ఆందోళనల తర్వాతైనా ఈ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తుందని భావించగా, అది తప్పని నిరూపించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల హాస్టళ్లు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు నానా పాట్లు పడుతున్నరు. నాసిరకం ఆహారం, అరకొర సదుపాయాలు, తీవ్ర చలికాలంలో చన్నీటి స్నానం తదితర పరిస్థితుల మధ్య కడుపు నొప్పి, వైరల్ ఫీవర్స్, వాంతులతో ఆనారోగ్యం బారిన పడుతున్నరు. ఈ మధ్యనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలకు చెందిన 44 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా విలవిలలాడిపోయారన్నారు.

 

కొన్ని చోట్ల వంట, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, పాఠశాల సిబ్బంది సమ్మె కారణంగా టీచర్లు, విద్యార్థులే వంట చేసుకునే పరిస్థితి నెలకొంది. భారతదేశాన్ని ఉద్ధరిస్తానంటూ బయల్దేరిన కేసీఆర్ గారి సంక్షేమ రాజ్యంలో ఇదీ విద్యార్థులు ఎదుర్కుంటున్న దుస్థితి అని పేర్కొన్నారు విజయశాంతి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news