సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

-

గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ ఇవాళ సర్వతోముఖాభివృద్ధి కోసం రాజశ్యామల యాగం చేశారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే రాజశ్యామల మహాయాగంలో కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు. ఈ యాగంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ దంపతులు మంగళవారం రాత్రి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకకు చెందిన 251 రుత్వికులతో యాగం ప్రారంభం అయింది. మూడు రోజుల పాటుజరిగే యాగంలో పాల్గొంటూనే.. మరోవైపు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు కూడా హాజరయ్యారు.

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే కేసీఆర్‌ యాగం అని స్వరూపానందేంద్ర తెలిపారు. మూడు రోజులపాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం జరుగనుంది. రాజశ్యామల యాగం చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వేదికగా మూడు రోజులపాటు యాగం.. యాగాన్ని పర్యవేక్షిస్తున్న విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర తెలిపారు. విశాఖ శారద పీఠం ఫణిశశాంక శర్మ ఆధ్వర్యంలో యాగం నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news