రైతు ఉత్పత్తి మరియు వాణిజ్య (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020, ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 పై రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం, మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ లో దీనికి పార్లమెంట్ లో ఆమోదం లభించింది. దీనిపై అక్కడి నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సింగు సరిహద్దులకు వెళ్తున్నారు. అక్కడ నిరసన చేస్తున్న రైతులకు ఆయన ఆహార ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇక్కడ రైతుల నిరసన 12 వ రోజుకి చేరుకుంది. సిఎంతో పాటుగా ఢిల్లీ ప్రభుత్వ ఇతర మంత్రులు కూడా అక్కడికి వెళ్తున్నారు. వ్యవసాయ చట్టాలపై డిసెంబర్ 8 న రైతు సంఘాలు భారత్ బంద్ కి పిలుపునిచ్చాయి.