భవిష్యత్ లో తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి.. దొడ్డు వడ్లు పండించకండి అంటూ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దొడ్లు వడ్లను ప్రస్తుతం ప్రజలు తినే పరిస్థితిలో లేవు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే.. రేషన్ షాపు వాళ్లే బ్లాక్ మార్కెట్లలో అమ్ముకుంటున్నరు. ప్రజలెవ్వరూ దొడ్డు బియ్యం తినడం లేదని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాన రవాణా శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి.
ఢిల్లీ నగరంలో కాలుష్యం వల్ల అక్కడ అప్రకటిత లాక్ డౌన్ విధించారు. కొన్నేళ్ల తరువాత ప్రజలు ఢిల్లీని విడిచి వెళ్లి పోతారు. హైదరాబాద్ నగరానికి అలాంటి పరిస్థితి రాకుండా చేసేందుకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ కి పంపి కాలుష్యం తగ్గేవిధంగా చేస్తామని తెలిపారు. ఈవీ వాహనాలు కొన్న వారికి రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. రానున్న రెండేళ్లలో సిటీలో ఉన్న బయటికీ తరలించి.. 3000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని ప్రకటించారు.