పార్టీ నేతలపై, అధికారులపై ఫైర్ అయినా సీఎం రేవంత్ రెడ్డి

-

నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. తనకు వాస్తవాలు చెప్పకుండా ఎందుకు దాస్తున్నారంటూ పార్టీ నేతలపై, అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ నిన్న గాంధీ ఆస్పత్రిలో నిరవధిక దీక్ష చేస్తున్న మోతీలాల్ తో పాటు నిరుద్యోగులతో చర్చలు జరిపింది.

ఈరోజు ఉదయం పలువురు నిరుద్యోగులను గాంధీభవన్ కు పిలిపించుకొని చర్చించింది. ఈ సందర్భంగా వాళ్లు ప్రధానంగా 4 డిమాండ్లను కమిటీ ముందుంచారు. వాటిని నోట్ చేసుకున్న కమిటీ ఈ సాయంత్రం సీఎంతో భేటీ కానుంది. ఈ 4 అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

నిరుద్యోగుల డిమాండ్స్ ఇవి

*గ్రూప్-1 లో 1:100 పద్ధతిలో పిలవాలి

*గ్రూప్-2 ను డిసెంబర్ లో నిర్వహించాలి

*డీఎస్సీని ఆగస్టులో నిర్వహిచాలి

*గ్రూప్-2,3లో కొలువుల సంఖ్య పెంచాలి

Read more RELATED
Recommended to you

Latest news