తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ జహీరాబాద్ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులను జనాలు కొట్టేటట్టు ఉన్నారు. తులం బంగారం ఆశ చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఇన్ని రోజులు నేను మౌనంగా, గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మామూలుగా ఉండదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాడు పోలింగ్ పెడితే 70 శాతం మనకే అనుకూలంగా ఓట్లు వేశారు.. 30 శాతం వాడికి వేశారని తెలిపారు.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే ఎంపీ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా జిమ్మిక్కులతో చెప్పడం కాదు కేసీఆర్ జనంలోకి రావాలి. ప్రతిపక్ష హోదా ఇచ్చాం.. కారు ఇచ్చాం అన్నారు. సోషల్ మీడియా మిత్రులతోనే వాళ్ళు ఫోన్లు చెప్పడం కాదు కేసీఆర్ జనంలోకి రావాలి కౌంటర్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలు పెట్టబోతున్న దాని తర్వాత కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టబోతున్నాం. ఎన్నికల్లో ఓట్లకు రమ్మనండి. మీరే ఓట్లు వేసుకొని మేము మెజార్టీ ఉన్నామని చెప్పుకోండి. దాంట్లో మాకేం అభ్యంతరం లేదు. ప్రతిపక్ష లీడరు ఎందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం లేదని ప్రశ్నించారు మల్లు రవి.