కుటుంబ డిజిటల్ కార్డ్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో రేషన్ కార్డుల స్థానంలో కుటుంబ డిజిటల్ కార్డులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీ, ఒక గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ఫ్యామిలీ కార్డులకు సంబంధించిన సర్వే పత్రాలు, డిజిటల్ కార్డులను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకే కుటుంబ డిజిటల్ కార్డులను తీసుకొచ్చినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా రేషన్ కార్డులు రాకపోవడంతో పథకాలు అందలేదని, వారందరికీ రేషన్ కార్డు అందించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రేషన్ కార్డు విధానం ఎత్తివేశారనే ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని సంక్షేమ పథకాలను ఈ డిజిటల్ కార్డుతో అనుసంధానం చేస్తామని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version