Breaking : భాగ్యలక్ష్మి అ‍మ్మవారికి దర్శించుకున్న సీఎం యోగి

-

హైదరాబాద్‌ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కూడా నగరానికి చేరుకున్నారు. కాగా, సీఎం యోగి.. ఆదివారం ఉదయం చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో యోగితో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.

CM Yogi Visited Bhagyalakshmi Temple At Charminar - Sakshi

సీఎం యోగి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రధాని మోడీ సైతం ఇప్పటికే సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ రోజు పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను ముగించుకుని రేపు ఉదయం విజయవాడకు ప్రధాని మోడీ పయనం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news