ఇంద్రకీలాద్రి పై ఉన్న దుర్గమ్మ కు పట్టు వస్త్రాలు సమర్పించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రభుత్వం తరపున ప్రతి ఏటా మూల నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించారు.
తొలుత ఇంద్రకీలాద్రి పైకి చేరుకున్న సీఎం జగన్ కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులు జగన్‌కు వివరించారు. అనంతరం వస్త్రధారణ పంచెకట్టు, తలపాగా చుట్టి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్‌కి ఆలయ ఛైర్మన్. ఇ ఓ, ఆలయ ప్రధాన అర్చకులు, స్దాన చార్యుల, వైదిక కమిటీ సభ్యులు, ఇతర అధికారులు ఆలయ మర్యాద లతో వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు.