ఏపీలో జగన్ కి అధికారం ఉంది కాబట్టి కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాడని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తన మీద ఎమ్మెల్యే పెద్దారెడ్డి కర్ణాటక లోకాయుక్తలో కేసు వేసిన అంశంపై అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో హక్కుల ఉల్లంఘన జరుగుతోందని లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ఆయన విమర్శించారు.
స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఉంటుంది కాబట్టే వాహనాలను అక్కడ కొనుగోలు చేస్తున్నామని ఆయన అన్నారు. కొత్త వాహనాలకు ఎలాంటి పరిమితులు ఉన్నాయో తమ వాహనాలకు కూడా అలాంటిదే ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఇక్కడ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఎన్ని కేసులు బనాయించినా మళ్లీ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే అయితే అధికారం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు.