ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం 2021-22 సంవత్సరానికి వివిధ శాఖల్లో ఉన్న 10,143 పోస్టులను ఏపీ సర్కార్ భర్తీ చేయనున్నది జగన్ సర్కార్. జులై నెలలో 123 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు చేయనుంది. ఆగస్ట్ నెలలో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, 2 కు చెందిన 36 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీ సర్కార్. సెప్టెంబర్ మాసంలో పోలీస్ శాఖలో 450 పోస్టులను భర్తీ చేయనున్న ఏపీ సర్కార్… అక్టోబర్ నెలలో వైద్య శాఖలో 451 పోస్టులను భర్తీ చేయనుంది.
అలాగే నవంబర్ వైద్యశాఖలోని 5,251 పారామెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనుంది ఏపీ సర్కార్. ఇక డిసెంబర్ లో 441 నర్సుల పోస్టుల భర్తీకి ఏపీ సర్కారు సన్నాహాలు చేస్తోంది. అలాగే వచ్చే ఏడాది జనవరిలో 240 డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనుంది జగన్ ప్రభుత్వం. 2022 ఫిబ్రవరి నెలలో వివిధ యూనివర్సిటీలో 2 వేల అసిస్టెంట్ పోస్టులు, 2022 మార్చిలో వివిధ శాఖలకు చెందిన 36 పోస్టులను భర్తీ చేయనుంది.