చైనా విద్యుత్ సంక్షోభం ఇండియాకు కూడా తప్పదా..!

-

చైనా ప్రస్తుతం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. బొగ్గు కొరత కారణంగా సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు ఆ దేశం కరెంట్ కోతలతో సతమతమవుతోంది. తాజాగా ఇటువంటి పరిస్థితే భారత్ కు తప్పదా అనే సందేహాలు వస్తున్నాయి. దేశంలో కూడా బొగ్గు కొరత ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా విద్యుత్, బొగ్గు నిల్వల కొరతపై ఏపీ ముఖ్యమంత్రి ప్రధాని మోడీకి లేఖ రాశారు. కరోనా తర్వాత దేశంలో ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడం, పరిశ్రమలు నడుస్తుండటంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. అయితే దీనికి సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవడంతో రానున్న రోజుల్లో చైనా పరిస్థితులే భారత్ కు రానున్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దేశంలో చిన్నా పెద్ద 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉంటే వాటిలో  సగానికిపైగా విద్యుత్ కేంద్రాల్లో సరిపడేంత బొగ్గు నిల్వలు లేవని తెలుస్తోంది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం కోల్ ఇండియా, ఎన్టీపీసీలతో చర్చలు జరుపుతోంది. మరికొన్నిరోజులు బొగ్గు కొరత ఉంటే దేశం కూడా కరెంట్ కోతలతో అల్లాడే పరస్థితి ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం చైనా పరిస్థితి ఇండియాకు ఎప్పటికి రాదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news