సామ్ పిల్లలను కంటానంది..రెండు నెలల్లోనే ఎదో జరిగింది : నీలిమ గుణ

సమంత పిల్లలను కనకపోవడం వల్లే నాగ చైతన్య తో విభేదాలు వచ్చాయని ముందు నుండి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా సమంత ఫ్యామిలీ లైఫ్ కు దూరంగా సినిమాలకు ఎక్కువ దగ్గర ఉంటుందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను సామ్ ఖండించింది. కాగా తాజాగా శాకుంతలం సినిమా నిర్మాత నీలిమ గుణ కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది… సమంత ను శాకుంతలం సినిమా కోసం సంప్రదించగా నో చెప్పిందని తెలిపింది.

తాను పిల్లల్ని కనాలని సమంత అనుకుంటున్నట్టు …కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమంత తనతో చెప్పినట్లు తెలిపింది. అయితే సినిమా కథ బాగా నచ్చడంతో సమంత సినిమా కు ఓకే చెప్పింది అని పేర్కొంది. కానీ జూలై, ఆగస్టు వరకు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని సమంత కండిషన్ పెట్టినట్టు నీలిమ పేర్కొంది. ఆ తర్వాత రెండు నెలల్లోనే సామ్ చైతూ ల మధ్య ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. ఇక నీలిమ గుణ వ్యాఖ్యలతో రెండు నెలల మధ్య ఏం జరిగింది అనే అనుమానాలు మొదలయ్యాయి.