ఏపీ హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనితకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె తింటున్న ఆహారంలో బొద్దింక… వచ్చింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత… తాజాగా బీసీ బాలికల హాస్టల్ లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Cockroach , AP Home Minister Anitha, ap
Cockroach found in AP Home Minister Anitha’s food

ఈ సందర్భంగా హాస్టల్ వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో భోజనం చేస్తుండగా హోం మంత్రి అనిత ప్లేట్ లో బొద్దింక కనిపించింది. బొద్దింక రాగానే అనిత కూడా ఏం చేయాలో తోచక.. విద్యార్థుల ముందు సైలెంట్ గా ముఖం చాటేసి నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అటు బొద్దింకలు రావడం పై హాస్టల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ హోం మంత్రి అనిత.

Read more RELATED
Recommended to you

Latest news