బ్రౌన్ రైస్ తో కొబ్బరన్నం చేసేయండిలా..!

-

కొబ్బరి అన్నం ఎంతో రుచిగా ఉంటుంది. అయితే మామూలు బియ్యంతో కంటే కూడా బ్రౌన్ రైస్ తో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే మరి ఈరోజు బ్రౌన్ రైస్ తో కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేది మనం చూద్దాం.

 

coconut brown rice

బ్రౌన్ రైస్ కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలు:

ఒక టేబుల్ స్పూన్ నూనె
ఒకటిన్నర కప్పులు బ్రౌన్ రైస్
రెండు కప్పులు కొబ్బరి పాలు
రెండు కప్పులు నీళ్లు
సాల్ట్ రుచికి సరిపడా
కొబ్బరి తురుము కొద్దిగా

తయారు చేసుకునే పద్ధతి:

ఇక తయారు చేసుకునే పద్ధతి చూసేస్తే.. ఒక పాన్ తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసి.. దానిలో కడిగిన బ్రౌన్ రైస్, కొబ్బరి పాలు, నీళ్లు, సాల్ట్, కొబ్బరితురుము వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి. బియ్యం బాగా ఉడకాలి గమనించండి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి కాసేపు అలా వదిలేయండి. ఇలా వదిలేస్తే రెసిపీ సెట్ అవుతుంది. పైన కావాలంటే మరి కొంచెం కొబ్బరితురుము వేసుకోవచ్చు. ఇలా ఎంతో ఈజీగా క్షణాల్లో ఈ రెసిపీ మనం తయారు చేసుకోవచ్చు. కొంత మంది పోపు, మసాలా వేస్తారు. కావాలంటే వేసుకొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news